అక్టోబర్ 2 న బీజేపీ ఎంపీల పాదయాత్ర

అక్టోబర్ 2 న బీజేపీ ఎంపీల పాదయాత్ర

జాతిపిత మహాత్మా గాంధీ  150వ  జయంతి సందర్భంగా… అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు  ప్రతీ లోక్ సభ  నియోజకవర్గంలో 150కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించనుంది  బీజేపీ. ఈ మేరకు  ఎంపీలకు  దిశానిర్దేశం చేశారు ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ. రాజ్యసభ  సభ్యులకు కూడా నియోజకవర్గాలు  కేటాయించనున్నారు. ప్రతీ నియోజకవర్గంలో  15 నుంచి 20 బృందాలు  ఏర్పాటు చేసి… ప్రతీ రోజుకు 15 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించాలని సూచించారు. మహాత్మా గాంధీ, స్వాతంత్ర్య పోరాటం, మెక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఉదయం పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్ లో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలతో ఈ వ్యాఖ్యలు చేశారు మోడీ. అలాగే ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వైఖరి, కీలక బిల్లులు, బడ్జెట్ ఆమోదంపై చర్చ జరిగింది.