దేవరకొండ(పీఏపల్లి), వెలుగు : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ హెచ్చరించారు. గురువారం పీఏ పల్లి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని, చిలుకమర్రిలోని ధాన్యం గోదామును ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం తూకం, నిల్వ ఏర్పాట్లు, రవాణా సౌకర్యాలను సమీక్షించి, కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
