నిజామాబాద్ జిల్లాలో వారంలో వడ్ల కొనుగోళ్లు క్లోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...లారీల షార్టేజ్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌లేకుండా చూడాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్ జిల్లాలో వారంలో వడ్ల కొనుగోళ్లు క్లోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...లారీల షార్టేజ్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌లేకుండా చూడాలి :   కలెక్టర్ ఇలా త్రిపాఠి
  • నిజామాబాద్​ జిల్లాలో ఇప్పటివరకు  6.30 లక్షల మెట్రిక్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌టన్నుల వడ్ల సేకరణ

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: జిల్లాలో యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వడ్ల కొనుగోళ్లు వారంలో ముగిస్తామని నిజామాబాద్​కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం ఆమె మీడియాకు ప్రకటన రిలీజ్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌చేశారు. జిల్లాలో మొత్తం 739 కొనుగోలు సెంటర్లు ఓపెన్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌చేసి ఇప్పటిదాకా 6.30 లక్షల మెట్రిక్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌టన్నుల ప్యాడీ సేకరించామన్నారు. కొనుగోళ్ల తర్వాత 430 సెంటర్స్‌‌‌‌‌‌‌‌ ను ‌‌‌‌‌‌‌‌మూసేశామని తెలిపారు. మిగితా సెంటర్లలో గరిష్టంగా 50 వేల టన్నుల వడ్లు అమ్మకానికి రావొచ్చని, వారంలో వాటిని సేకరించి కొనుగోళ్లు ముగిస్తామన్నారు. 

ఎండల తీవ్రతను పరిగణనలోకి తీసుకొని కొనుగోలు సెంటర్ల వద్ద ఫస్ట్​ ఎయిడ్​  ‌‌‌‌‌‌‌‌సదుపాయాలు కల్పించాలని, ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ప్యాకెట్లు, మజ్జిగ, తాగునీరు ఉండేలా చూడాలని సెంటర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌నిర్వాహకులకు సూచించారు. లారీల షార్టేజ్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌లేకుండా జాగ్రత్తలు ‌‌‌‌‌‌‌‌చేపట్టాలన్నారు. రూ.1,500 కోట్ల విలువ ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.1,320 కోట్ల బిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డిపాజిట్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌చేశామని తెలిపారు. జనగణనలో భాగంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి గంగాస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‒1 ఏరియాలోని పద్మజ అనే మహిళ ఇంటిని విజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఎన్యూమరేటర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ఐడీ కార్డు ధరించిన వారినే ఇళ్లలోకి అనుమతించాలని ప్రజలకు సూచించారు.

అడిషనల్ ​కలెక్టర్​ తనిఖీలు

జన్నారం రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా జన్నారంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోడౌన్, మొర్రిగూడలోని రాఘవేంద్ర రైస్ మిల్ గోడౌన్, చింతగూడ ప్యాక్స్ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య సందర్శించారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తహసీల్దార్, జి.బక్కయ్య, ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ ఉన్నారు.

ప్రతి శాఖ ప్రోగ్రామ్స్‌‌‌‌‌‌‌‌పై డాక్యుమెంటరీ రూపొందించాలి

కరీంనగర్ టౌన్, వెలుగు:--ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా 22న కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించనున్న జిల్లా స్థాయి సభను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి సభ నిర్వహణపై వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో బుధవారం రివ్యూ నిర్వహించి మాట్లాడారు. 99 డేస్‌‌‌‌‌‌‌‌ ప్రణాళికలో ప్రతి శాఖ నిర్వహించిన కార్యక్రమాలను డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శించాలని సూచించారు. 

ప్రభుత్వ పథకాలకు ఎంపికైన లబ్ధిదారులు, ప్రతి శాఖలో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, లబ్ధిదారుల ఎంపిక, ఆర్థికపరమైన లబ్ధి, వివిధ అంశాలపై బడిబాట, జాబ్ మేళా, అవగాహన కార్యక్రమాలపై ఈ సభలో వివరించాలని తెలిపారు. సమావేశంలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, సీపీవో రామ్ దత్తారెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.