కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వేటు

కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వేటు

హైదరాబాద్: హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకేనంటూ కాంగ్రెస్‌ నేత పాడి కౌశిక్‌ రెడ్డి ఓ యువకుడితో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో వైరల్ కావడంతో వివరణ కోరిన కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ సంఘం ఆయనపై వేటు వేసింది. పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. టీఆర్‌‌ఎస్‌తో కుమ్మక్కై, ఆ పార్టీ కోవర్టుగా పని చేస్తున్నారని, అందుకే ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండ రెడ్డి ప్రకటించారు. కౌశిక్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌ కుమార్ గౌడ్ అన్నారు. 
2018 ఎన్నికల్లో హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి పోటీ చేశారు. అప్పుడు దాదాపు 60 వేల ఓట్లకు పైగా దక్కించుకున్నారు. ఈటల రాజేందర్ రాజీనామాతో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతారన్న ప్రచారం ముందు నుంచి జరుగుతోంది. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కేటీఆర్ ను, కౌశిక్ రెడ్డి కలవడంతో టీఆర్ఎస్ లో చేరిక ఖాయమని ప్రచారం జరిగింది. అయితే తాను కాంగ్రెస్ నుంచే పోటీచేస్తానని కౌశిక్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు ఈ ఆడియోలు వైరల్ గా మారాయి.