నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా: పద్మా దేవేందర్​రెడ్డి

నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా:  పద్మా దేవేందర్​రెడ్డి

మెదక్ టౌన్, వెలుగు:  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్​ఎస్​ మెదక్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి అన్నారు. ఆదివారం హవేళీ ఘనపూర్​ మండలంలోని తొగిట, మద్దుల్​వాయి, ముత్తాయికోట, కూచన్​పల్లి, ముత్తాయిపల్లి, ఫరీద్​పూర్, వాడి, రాజిపేట, కొత్తపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడాడుతూ.. కాంగ్రెస్​కు ఓటేస్తే రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయినట్లేనన్నారు. మెదక్​ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం కల్పించాల్సిందిగా ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో మెదక్​ మాజీ ఎమ్మెల్యే, బీఆర్​ఎస్​ నాయకులు శశిధర్​రెడ్డి, ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, సర్పంచ్​లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ALSO READ : బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌తో కుమ్మక్కైన వ్యక్తికి టికెట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన్రు : జంగా రాఘవరెడ్డి