యాభైవేల చెట్లు పెంచిన ఒకే ఒక్కడు.. పద్మశ్రీతో సత్కారం

యాభైవేల చెట్లు పెంచిన ఒకే ఒక్కడు.. పద్మశ్రీతో సత్కారం

రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా 118 మందిని పద్మశ్రీ అవార్డులకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంపికచేసింది. అందులో రాజస్థాన్‌కు చెందిన పర్యావరణవేత్త సుందరం వర్మ ఒకరు. ఆయన 50,000 చెట్లను పెంచినందుకుగాను భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. 68 ఏళ్ల సుందరం వర్మ రాజస్థాన్‌లోని శుష్క షెకావతి ప్రాంతంలో ఆ చెట్లను పెంచాడు. చెట్లను పెంచడానికి ‘డ్రైలాండ్ అగ్రోఫారెస్ట్రీ’ అనే విధానాన్ని పాటించి.. ఒక చెట్టుకు ఒక లీటరు నీరు మాత్రమే ఉపయోగించారు.

వర్షపు నీరు ఇంకిపోకుండా ఉండటానికి భూమిని సమంచేసి, కలుపు మొక్కలు తొలగించేవాడు సుందరం వర్మ. ఆ తర్వాత పొలాన్ని అనేక సార్లు దున్ని.. లోతైన గుంట తీసి మొక్కలను నాటేవాడు. ఆ గుంటలో ఒక లీటరు నీరు పోసి.. మొక్క పెరిగేలా చేయడం సుందరం వర్మ ప్రత్యేకత. ‘ఈ పురస్కారంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ పురస్కారం నా పనిని మరింతగా పెంచుతుంది’ అని సుందరం వర్మ అన్నారు.

For More News..

తమ ఓటు తామే వేసుకోని వార్డు మెంబర్లు

స్మార్ట్‌ ఫోన్ల వాడకంలో అమెరికాను దాటిన భారత్