
జీవితంలో మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రజ్వల ఫౌండేషన్ సహ స్ధాపకురాలు సునీత కృష్ణన్ అన్నారు. నగరంలో రాచకొండ పోలీస్ ఆధ్వర్యంలో పిఫుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ – సమ్మర్ క్యాంప్ ఫర్ చిల్డ్రన్స్ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా సునీత కృష్ణన్, రాచకొండ సీపీ మహేష్ భగవత్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సునీత కృష్ణన్ మాట్లాడుతూ..తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకం విషయంలో ముఖ్యంగా మూడు విషయాలలో జాగ్రత్తగా ఉండాలన్నారు. సెల్ ఫోన్స్,సినిమా,ప్రేమ ఈ మూడు వారి భవిష్యత్తును నాశనం చేయకుండా కాపాడాల్సిన బాధ్యత పేరెంట్స్ ది అన్నారు. టెక్నాలజీ, వినోదం ఎదైనా సరే.. వాటిని సరియైన రీతిలోనే వాడుకోవాలని సూచనలిచ్చారు. ప్రతి వ్యక్తికి తన మీద తనకు నమ్మకం ఉండాలని, నేర్చుకున్న ప్రతి విషయాన్ని పిల్లలు గుర్తుంచుకొవాలని అన్నారు. తద్వారా వారు ఛాంపియన్ గా నిలిచే అవకాశముంటుందన్నారు.
పిల్లలు ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి ప్రవర్తనా మంచిగా ఉండాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రెండు రోజుల కార్యక్రమంలో పిల్లలకి ట్రాఫిక్ రూల్స్ ,సైబర్ క్రైమ్స్ పట్ల అవగాహన కల్పించామని తెలిపారు.