పద్మవ్యూహంలో చక్రధారి చిత్రం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

పద్మవ్యూహంలో చక్రధారి చిత్రం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

ప్రవీణ్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ హీరోగా సంజయ్‌‌‌‌‌‌‌‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో కె.ఓ.రామరాజు నిర్మిస్తున్న చిత్రం ‘పద్మవ్యూహంలో చక్రధారి’. శశికా టిక్కో, అశురెడ్డి హీరోయిన్స్. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేసిన హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా బాగుంది. ఈ యూత్‌‌‌‌‌‌‌‌ఫుల్ లవ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా. 

అలాగే ఇందులో నటించిన హీరోహీరోయిన్స్‌‌‌‌‌‌‌‌కు, టెక్నీషియన్స్‌‌‌‌‌‌‌‌కు నా బెస్ట్ విషెస్’ అని చెప్పాడు.  విలేజ్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కిన లవ్ స్టోరీ ఇదని ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా అర్థమవుతోంది.  మధునందన్, భూపాల్ రాజ్, ధనరాజ్, రూప లక్ష్మి , మురళీధర్ గౌడ్ ఇతర  పాత్రలు పోషిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 21న థియేటర్స్‌‌‌‌‌‌‌‌లో విడుదల చేయబోతున్నట్టు దర్శకనిర్మాతలు తెలియజేశారు.