
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పెయిడ్ క్యాంపెయిన్ జరుగుతోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గురువారం ఢిల్లీలో సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్)– 65వ వార్షిక సదస్సులో గడ్కరీ మాట్లాడారు. ఈ సందర్భంగా 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై ఆందోళనలు ప్రస్తావనకు వచ్చాయి.
ఇది సురక్షితమైనదని రెగ్యలేటర్స్, వాహనతయారీదారులు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ‘‘ఇ–20 ప్రోగ్రామ్ పై ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ), సుప్రీంకోర్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చాయి. నన్ను రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరిగింది. ఇది పెయిడ్ క్యాంపెయిన్. దీనిపై ఎక్కువగా దృష్టి సారించనవసరం లేదు”అని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.