
ట్రెంట్ బ్రిడ్జ్ : వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్ తో నాటింగ్ హామ్ లో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. కేవలం.. 105 పరుగులకే కుప్పకూలింది పాకిస్థాన్ టీమ్. వెస్టిండీస్ ముందు 106 రన్స్ స్వల్ప టార్గెట్ పెట్టింది.
టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కరీబియన్ బౌలర్లు మొదటినుంచే.. ఎటాకింగ్ ప్లే చేస్తూ… పాకిస్థాన్ ను చుట్టిపడేశారు. పాకిస్థాన్ ఆటగాళ్లు కనీస భాగస్వామ్యాలు నమోదు చేయకపోవడంతో… ఆ జట్టుస్కోరు చతికిలపడింది.
పాక్ ప్లేయర్లలో ఫఖర్ జమాన్ 22, బాబర్ అజామ్ 22, రియాజ్ 18, హఫీజ్ 16 మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ను… 8 రన్స్ కే పెవీలియన్ పంపించాడు విండీస్ కెప్టెన్ హోల్డర్.
వెస్టిండీస్ బౌలర్లలో.. థామస్ 4, హోల్డర్ 3, రసెల్ 2, కాట్రెల్ ఒక వికెట్ పడగొట్టారు.