
ప్రపంచకప్ లో పాల్గొనే పాకిస్తాన్ క్రికెట్ టీంలో మార్పులు చేసింది పాక్ క్రికెట్ బోర్డు. ఈ మధ్య ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో 0-4 తేడాతో ఓటమి పాలవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచకప్ కు ప్రకటించిన 15 మంది ఆటగాళ్లలో ముగ్గురిని రిప్లేస్ చేసింది. అబిద్ అలీ, ఫహీమ్ ఆష్రఫ్, జునైద్ ఖాన్‌ల స్థానంలో మహ్మద్ అమీర్, వాహబ్ రియాజ్, అసిఫ్ అలీలకు ప్రపంచ కప్ జట్టులో స్థానం కల్పించింది.
ప్రపంచ కప్ లో చోటు దక్కిందనే వార్త తెలిసే లోగా.. అసిఫ్ అలీ ఇంట్లో తీరని విషాదం జరిగింది. 18నెలల వయసున్న అసిఫ్ కూతురు క్యాన్సర్ తో పోరాడుతే అమెరికాలో మృతిచెందింది. అంత్యక్రియలు పాకిస్తాన్ లోని లాహోర్ లో జరుగుతాయని అసిఫ్ కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ప్రాక్టీస్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైమ్ కు అసిఫ్ టీంతో కలుస్తాడని పాక్ బోర్డు తెలిపింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అసిఫ్ ఫ్యామిలీకి తన సంతాపాన్ని తెలిపారు.
My condolences and prayers go to Asif Ali & his family on the passing of his daughter from cancer. May Allah give them strength to bear such a precious loss.
— Imran Khan (@ImranKhanPTI) May 20, 2019