V6 News

బాబర్ అజామ్ చేసిన పనికి పాక్ కు 5 పరుగుల ఫైన్

బాబర్ అజామ్ చేసిన పనికి పాక్ కు 5 పరుగుల ఫైన్

బాబర్ అజామ్ చేసిన పనికి పాకిస్తాన్ టీమ్ కు ఐదు పరుగుల ఫైన్ పడింది.  శుక్రవారం ముల్తాన్ స్టేడియంలో వెస్టిండిస్ తో జరిగిన రెండో వన్డేలో బాబర్ అజామ్  క్రికెట్  రూల్స్ బ్రేక్ చేశాడు. వెస్టిండీస్ బ్యాటింగ్ చేస్తుండగా.. గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తున్న బాబర్ అజామ్ 29 ఓవర్లో  చేతికి వికెట్ కీపర్ గ్లోవ్స్  పెట్టుకుని ఫీల్డింగ్ చేశాడు. దీంతో అంపైర్లు బాబర్ అజామ్ ను మందలించడమే గాకుండా.. వెస్టిండీస్ కు అదనంగా 5 పరుగులు కేటాయించారు. రూల్స్ ప్రకారం గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు వికెట్ కీపర్ మినహా మిగతా వారెవరూ గ్లోవ్స్ ను పెట్టుకోకూడదు. ఈ వన్డేలో పాకిస్తాన్ 275 పరుగులు చేసింది.  బాబర్ అజామ్ 77 పరుగులతో రాణించాడు.   వెస్టిండీస్ 32.2 ఓవర్లలోనే 155 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆదివారం థర్డ్ వన్డే ఆడనుంది.