
- ప్రయోగించిన కొద్దిసేపటికే క్రాష్
ఇస్లామాబాద్: మన దేశం ప్రయోగించిన క్షిపణి పొరపాటున పాకిస్తాన్‌లో పడిన క్రమంలో.. తాజాగా పాక్ కూడా ఓ క్షిపణి ప్రయోగించింది. అయితే, ప్రయోగించిన కొద్ది సేపట్లోనే ఆ మిసైల్కూలిపోయింది. దీనికి సంబంధించి పాకిస్తాన్ నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ కొన్ని లోకల్ మీడియా చానళ్లు ఈ వివరాలను వెల్లడించాయి. గురువారం సింధ్‌లోని ప్రయోగ కేంద్రం నుంచి ఉదయం 11 గంటలకు ఓ మిసైల్‌ను ప్రయోగించాలని పాక్ నిర్ణయించింది. అయితే, ట్రాన్స్‌పోర్టర్ ఎరెక్టర్ లాంచర్(టీఈఎల్)లో లోపం వల్ల టెస్ట్‌ను వాయిదా వేసింది. గంట తర్వాత మిసైల్‌ను మళ్లీ ప్రయోగించగా సింధ్ ప్రావిన్స్ జంషోరో ప్రాంతంలోని థాన బులాఖాన్‌లో కూలిపోయింది.