పాకిస్తాన్ వైమానిక దళంలో మొదటి హిందూ పైలెట్‌గా రాహుల్‌దేవ్ ఎంపికయ్యారు. వైమానిక దళంలో జనరల్ డ్యూటీ పైలట్‌గా ఆయన విధులు చేపట్టనున్నారు. రాహుల్ సింధ్ రాష్ట్రంలోని తార్‌పర్కర్ జిల్లాకు చెందినవాడు. వెనకబడిన ప్రాంతమైన ఈ జిల్లాలో హిందువులు అధిక సంఖ్యలో నివసిస్తుంటారు. రాహుల్ దేవ్ పైలెట్‌గా ఎంపికకావడంపై ఆ జిల్లాకు చెందిన వారు హర్షం వ్యక్తం చేశారు. పాక్ సైన్యం, పౌర సేవల రంగాల్లో ఇప్పటికే మైనారిటీ వర్గాలకు చెందినవారు పలువురు ఉద్యోగులుగా ఉన్నారు.
