టీ20 ప్రపంచకప్–2026లో పాకిస్తాన్ జట్టు తీవ్ర నిరాశలో ఉంది. సూపర్–8 దశలో తొలి మ్యాచ్ వర్షంతో రద్దుకాగా, రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. పల్లెకెలె వేదికగా నిన్న ( ఫిబ్రవరి 24న) జరిగిన ఈ మ్యాచ్ పాక్ సెమీఫైనల్ ఆశలను మరింత సంక్లిష్టం చేసింది. కాగా ఇంగ్లాండ్‌తో కీలక మ్యాచ్‌లో ఓడిపోయిన అనంతరం పాక్ సెమీఫైనల్ అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఈ ఓటమికి కెప్టెన్ సల్మాన్ ఆఘానే కారణమని కొందరు ఫ్యాన్స్ భావిస్తూ, సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ పాక్ కెప్టెన్ తో పాటు ఆగకుండా, అతని కుటుంబ సభ్యుల వరకూ వెళ్లిపోయింది.
సోషల్ మీడియాలో కొందరు ఫ్యాన్స్ సల్మాన్ ఆఘా భార్య, చిన్న కుమారుడిపై కూడా అభ్యంతరకరమైన కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ సెమీస్ చేరకపోతే కుటుంబానికి ప్రమాదమంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీంతో ఈ ట్రోలింగ్‌పై సల్మాన్ ఆఘా భార్య సబా మంజర్ తీవ్రంగా మండిపడింది. పాకిస్తానీ ఫ్యాన్స్.. నన్నో, నా బిడ్డనో దూషించడంతో మనం ప్రపంచకప్ గెలవలేమని ఆమె సోషల్ మీడియాలో గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంగ్లాండ్ చేతిలో ఓడిన తర్వాత పాక్ ప్లేయర్స్ పై సోషల్ మీడియాలో తిట్ల వర్షం పడటం ఇదే తొలిసారి కాదు..
►ALSO READ | IND vs ZIM: డూ ఆర్ డై మ్యాచ్‌లో టీమిండియా కీలక మార్పు.. అభిషేక్ స్థానంలో సంజూ?
గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేక సార్లు జరిగాయి. 1996 వరల్డ్‌కప్‌లో భారత్ చేతిలో ఓడిన తర్వాత పాక్ క్రికెటర్ల ఇళ్లపై దాడులు కూడా జరిగాయి. ఇదిలా ఉండగా, సూపర్–8లో శ్రీలంకపై, తాజాగా పాకిస్తాన్‌పై వరుసగా గెలిచి ఇంగ్లీష్ టీమ్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం మిగిలిన మ్యాచ్‌లపై ఆధార పడాల్సిన పరిస్థితిలో నెలకొంది. దీంతో పాకిస్తాన్ జట్టు మైదానంలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ప్లేయర్స్ కుటుంబాలను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి విమర్శలు చేయడం కొనసాగుతుంది.
