Babar Azam: పాక్ కెప్టెన్ చెత్త రికార్డు..వరల్డ్లోనే మొదటి ప్లేయర్...

Babar Azam: పాక్ కెప్టెన్ చెత్త రికార్డు..వరల్డ్లోనే మొదటి ప్లేయర్...

న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. మూడో వన్డేలో కేవలం 4 పరుగులే చేసిన ఆజమ్.. స్టంప్ ఔట్ అయ్యాడు. దీంతో ఓ అరుదైన చెత్త రికార్డును తన పేరుమీద లిఖించుకున్నాడు. వరుసగా మూడు వన్డేల్లోనూ ఒకే విధంగా అవుటైన ప్లేయర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల్లోనూ బాబర్‌.. స్టంప్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ఒక సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల్లోనూ స్టంప్‌ అవుటైన ఆటగాడిగా బాబర్‌ చెత్త రికార్డును క్రియేట్ చేశాడు. 

ఫస్ట్ వన్డేలో  82 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 66 పరుగులు చేసిన బాబర్‌ అజమ్‌.. గ్లెన్‌ ఫిలిప్స్‌ బౌలింగ్‌లో స్టంప్‌ అవుట్‌ అయ్యాడు. రెండో వన్డేలో 114 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 79 పరుగులు చేసిన బాబర్‌.. సోధీ బౌలింగ్‌లో స్టంప్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. తాజాగా కరాచీ వేదికగా జరిగిన మూడో వన్డేలోనూ బాబర్ స్టంప్ ఔటయ్యాడు. 13 బంతుల్లో ఒక ఫోర్‌తో 4 పరుగులు చేసిన బాబర్‌..బ్రాస్‌వెల్‌ బౌలింగ్‌లో  స్టంప్‌ అవుట్‌గానే పెవిలియన్‌ చేరాడు. దీంతో బాబర్‌ అజమ్‌ స్టంప్‌ ఔట్స్‌లో హ్యాట్రిక్‌ సాధించాడంటూ.. క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.