బుద్గాంలో జెట్ ను మేం కూల్చలేదు: పాక్

బుద్గాంలో జెట్ ను మేం కూల్చలేదు: పాక్

Pakistan confirms it had nothing to do with the Mi-17 crash in Budgamఇస్లామాబాద్: జమ్ము కశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో బుధవారం ఉదయం కూలిన ఎంఐ-17 తో తమకు ఏ సంబంధం లేదని పాక్ స్పష్టం చేసింది. భారత్ వైపు యుద్ధ విమానం కూలిందని రిపోర్ట్ వస్తున్నాయని, అయితే దాన్ని తాము కూల్చలేదని చెప్పింది. ఈ విషయాన్ని పాక్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.

కాగా, జమ్ముకశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలోని గారెండ్ కలాన్ గ్రామంలో ఓ యుద్ధవిమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. ఈ ఘటనపై బుద్గాం జిల్లా ఎస్ఎస్పీ మాట్లాడుతూ టెక్నికల్ టీం దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఆ యుద్ధ విమానం ఎవరిదన్న విషయంపై దర్యాప్తు తర్వాత తేలుతుందన్నారు.