ఆహా ఏమి అందం: కుర్రాళ్ల మనసు దోచేస్తున్న పాక్ క్యూట్ డాక్టర్

ఆహా ఏమి అందం: కుర్రాళ్ల మనసు దోచేస్తున్న పాక్ క్యూట్ డాక్టర్

ఎంతటివారైనా మగువల అందానికి కాంతా దాసులే అన్నాడు ఓ సినీ కవి. దేశాన్ని ఏలే రాజైనా మగువ అందాన్ని చూసి మూర్ఛ పోవాల్సిందే. ఒకసారి ఆమె అందానికి ఫిదా అయితే రాజ్యాలు వదులుకోవాల్సిందే. అంతటి అందం ఈ అమ్మడు సొంతం.

ఆడవారిని చూడగానే ప్రధానంగా ఆకర్షించేది వారి అందం. శిల్పంలాంటి ఆకృతి.. తీర్చిదిద్దినట్లు ఉండే రూపం.. ముఖంపై చెరగని నవ్వు.. ఇవి చాలు కుర్రాళ్ల గుండెలు మెలిపెట్టడానికి. పాకిస్తాన్ యువ జట్టుకు డాక్టర్‌గా సేవలందిస్తున్నఓ యువతి రూపం అలాంటిదే. మైదానంలో కనిపించిందో లేదో.. ఎక్కడ చూసినా తన వీడియోలే.. ఎవరి నోట విన్నా ఆమె మాటలే.

ఇంతటి అందాన్ని చూపించిన కెమెరామెన్‌ను మెచ్చుకునే వారు కొందరైతే, ఇలాంటి డాక్టర్లు మైదానంలో కనిపిస్తుంటే క్రికెట్‌కు మరింత ఆదరణ లభిస్తుందని చెప్తున్నవారు మరికొందరు. ఆమె అందాన్ని వర్ణిస్తూ కవిత్వాలు అల్లుతున్నవారు ఇంకొందరు. ఏదేమైనా ఈ అమ్మడు అందానికి ఆ మాత్రం మాటలు కూడా తక్కువే అని చెప్పుకోవాలి.