పాక్‌‌లో భారీ వరదలు.. అమెరికా సాయం

పాక్‌‌లో భారీ వరదలు.. అమెరికా సాయం

భారీ వర్షాలకు అతలాకుతలమైన పాకిస్థాన్.. ప్రపంచ దేశాల సాయం కోసం ఎదురుచూస్తోంది. దీంతో ఐక్యరాజ్య సమితితో కలిసి విరాళాల కోసం ప్రయత్నిస్తోంది. దీనికి స్పందించిన అమెరికా పాక్ కు 30 మిలియన్ డాలర్ల సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఈ కష్టసమయంలో పాక్ కు అండగా నిల్చుంటామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ హామీ ఇచ్చారు. ఆర్థిక సాయన్ని ఆహారం, పిల్లల పౌష్టికాహారం, తాగునీరు, ప్రజారోగ్య అవసరాలకు వాడుకునేలా పాక్ తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు అమెరికా ప్రతినిధులు పాకిస్థాన్ కు చేరుకున్నారు.

కష్టసమయంలో పాక్ కు అండగా ఉంటామని అమెరికా పేర్కొంది. పాక్ లో వరదల వల్ల దాదాపు 33 మిలియన్ల మంది నిరాశ్రయులైనట్లు అమెరికా విదేశాంగశాఖ తెలిపింది. దాదాపు పదకొండు వందల మంది మరణించారు. పదహారు వందల మందికి పైగా గాయపడ్డారు. దాదాపు పది లక్షల నివాసాలు ధ్వంసమయ్యాయి. 8 లక్షల పశువులు చనిపోయాయి. పెద్ద ఎత్తున రోడ్లు, 20 లక్షల ఎకరాల్లో పంట నష్టానికి గురైంది.