అక్రమాస్తుల కేసులో పాక్ మాజీ మంత్రి అరెస్ట్

అక్రమాస్తుల కేసులో పాక్ మాజీ మంత్రి అరెస్ట్
అక్రమాస్తులు కలిగి ఉన్నాడనే కారణంతో పాక్‌ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్‌ను అవినీతి నిరోధక అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. పార్టీ సమావేశం నుంచి బయటకు వస్తున్న ఆసిఫ్‌ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఏబీ) అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆసిఫ్ 2004 నుంచి 2008 వరకు దుబాయి వర్క్ పర్మిట్‌ను కలిగి ఉన్నారని.. ఆ సమయంలో ఆయన కన్సల్టెంట్ లీగల్ అడ్వైజర్‌గా పనిచేస్తూ 136 మిలియన్లు సంపాదించారని బ్యూరో తెలిపింది. పీఎంఎల్-ఎన్ చీఫ్, మాజీ ప్రీమియర్ నవాజ్ షరీఫ్ ఈ అరెస్టును ఖండించారు. నవాజ్ షరీఫ్‌‌కు వ్యతిరేకంగా పనిచేయాలని పాక్ ప్రభుత్వం ఆసిఫ్‌పై ఒత్తిడి తెస్తుందని.. అందుకు ఆయన అంగీకరించకపోవడంతో అరెస్టు చేశారని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ ఆరోపించారు. పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షెబాజ్ షరీఫ్, సీనియర్ సభ్యులు హంజా షెబాజ్, రానా సనావుల్లా, జావేద్ లతీఫ్, అహ్సాన్ ఇకాబ్ల్, షాహిద్ ఖాకాన్ అబ్బాసి, సాద్ రఫీక్ తదితరులతో సహా అవినీతి కేసులను ఎదుర్కొంటున్న పీఎంఎల్-ఎన్ నాయకుల జాబితాలో ఆసిఫ్ కూడా ఇప్పుడు చేరారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా 11 ప్రతిపక్ష పార్టీలు కలసి పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్‌గా ఏర్పడి నిరసన ర్యాలీలు చేస్తున్నాయి. ఈ సమయంలో ఖవాజా అరెస్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. For More News.. ఆర్గానిక్ ఎగ్స్‌ వ్యాపారంలో దూసుకుపోతున్న వనపర్తి మహిళ చిన్న ఇండ్లపై పెరుగుతున్న ఫోకస్.. తీరనున్న సొంతింటి కల ‘ములాగ్‌’ మెడల్‌ సాధించిన ఏకైక క్రికెటర్ న్యూఇయర్ ఆఫర్: అమెజాన్‌‌‌‌‌‌‌‌లో ‘మెగా శాలరీ డేస్‌‌‌‌‌‌‌‌’