'సెక్స్ కాల్' వివాదంలో పాక్​ మాజీ ప్రధాని

'సెక్స్ కాల్' వివాదంలో పాక్​ మాజీ ప్రధాని

ఇస్లామాబాద్:  పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఒక మహిళతో ఆయన సన్నిహితంగా మాట్లాడిన(సెక్స్ టాక్) రెండు ఆడియో క్లిప్ లు లీక్ అయ్యాయి. వీటిని పాకిస్తానీ జర్నలిస్ట్ సయ్యద్ అలీ హైదర్ తన యూట్యూబ్ చానెల్‌లో షేర్ చేశారు. క్లిప్‌ల్లో ఇమ్రాన్ ఖాన్ ఒక మహిళతో అసభ్యకరమైన రీతిలో మాట్లాడినట్లు ఉంది.

ఆడియో రికార్డింగులు బయటకు వచ్చినప్పటి నుంచి పాక్​లో దుమారం రేగుతోంది. లీక్ అయిన క్లిప్​లలో ఇమ్రాన్ ఖాన్ గా భావిస్తున్న వ్యక్తి.. ఫోన్​లో ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడుతున్నట్లు..పర్సనల్ గా కలవాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా ఉంది. ఆడియో లీకులపై పీటీఐ స్పందిస్తూ.. అవన్నీ ఫేక్ అని కొట్టిపారేసింది. ఇమ్రాన్ వ్యక్తిత్వానికి మచ్చ తేవాలనే కుట్రతో అధికార పార్టీ నేతలు ఇలా చేశారని ఆరోపించింది.