కరోనా విపత్తు.. భారత్‌కు పాక్ ఆఫర్

V6 Velugu Posted on Apr 25, 2021

ఇస్లామాబాద్: కరోనాతో విలవిల్లాడుతున్న భారత్‌‌కు సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషి అన్నారు. మానవత్వానికి తాము అధిక ప్రాధాన్యమిస్తామని, ఇండియాకు అవసరమైన వైద్య సాయాన్ని అందించేందుకు రెడీగా ఉన్నామని తెలిపారు. మహమ్మారి వల్ల బాధపడుతున్న ఇండియా ప్రజలకు సంఘీభావం తెలిపిన ఖురేషి.. వెంటిలేటర్లు, బై పాప్, డిజిటల్ ఎక్స్‌‌రే మెషిన్లు, పీపీఈలతోపాటు ఇతర మెడికల్ ఎక్విప్‌‌మెంట్‌ను భారత్‌కు ఆఫర్ చేశామని ట్వీట్ చేశారు.

 

Tagged India, Pakistan, ventilators, Medical Equipment, Shah Mahmood Qureshi, Amid Covid Scare

Latest Videos

Subscribe Now

More News