
బర్మింగ్ హామ్:వరల్డ్ కప్ 2019 సీజన్ క్లైమాక్స్ చేరుతుండటంతో ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ప్రారంభంలో వర్షాలు, వన్ సైడ్ మ్యాచ్ లతో కాస్త బోర్ అనిపించిన వరల్డ్ కప్..ఇప్పుడు మంచి థ్రిల్లింగ్ ఇస్తుంది. పాయింట్ల పరంగా ఒక్కో మ్యాచ్ విక్టరీలతో తలకిందులవుతున్నాయి. చిన్న టీమ్స్ పెద్ద దేశాలకు ఝలక్ ఇస్తుండటంతో సెమీస్ ఆశలపై గట్టిగా ఆడాలనుకుంటున్నాయి టీమ్స్. అయితే ఆదివారం ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ కి పెద్ద కష్టం వచ్చింది. తప్పనిపరిస్థితుల్లో ఇండియా గెలవాలని కోరుకోవాల్సి వచ్చింది.
అఫ్గనిస్థాన్ తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో పాక్ అతికష్టం మీద గెలుపొందింది. ఇమాద్ వసీమ్ పోరాటంతో పాక్ గట్టెక్కింది. వరల్డ్ కప్ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో అఫ్గాన్‌పై పాక్ గెలుపుతో ఇంగ్లాండ్‌పై ఒత్తిడి నెలకొంది. లాస్ట్ వరకు రసవత్తరంగా సాగిన మ్యాచ్ లో పాక్ ఓడితే ఇంగ్లాండ్ కు లైన్ క్లియర్ అయ్యేది.
ఇంగ్లాండ్ తన చివరి రెండు మ్యాచుల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇంగ్లాండ్ ఆదివారం భారత్ తో ఆడుతుండగా.. బుధవారం న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇంగ్లీష్ టీమ్ ను ఇండియా ఓడిస్తే.. పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే ఈ మూడు జట్ల అవకాశాలు మరింత సంక్లిష్టమవుతాయి. దీంతో పాక్ ఫ్యాన్స్ చరిత్రలో ఫస్ట్ టైం ఇండియా గెలవాలని కోరుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ మారాయి.