పాకిస్థాన్‌లో బాంబు పేలుళ్లు.. 25 మంది మృతి

 పాకిస్థాన్‌లో బాంబు పేలుళ్లు.. 25 మంది మృతి

పార్లమెంట్ ఎన్నికలు జరగడానికి ఒకరోజు ముందు బుధవారం పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో రెండు బాంబులు పేలాయి. ఈ  పేలుళ్లలో కనీసం 25 మంది మరణించగా 40 మందికి  పైగా గాయపడ్డారు. మొదటి బాంబు పేలుడు పిషిన్ జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి అస్ఫంద్యార్ ఖాన్ కాకర్ కార్యాలయం వెలుపల సంభవించగా 17 మంది మరణించగా 30 మంది గాయపడ్డారు. 

ఇది జరిగిన ఒక గంట లోపే కిల్లా అబ్దుల్లా ప్రాంతంలోని జమియత్-ఉలేమా ఇస్లాం-పాకిస్తాన్ ఎన్నికల కార్యాలయం వెలుపల మరో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో  ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.  ఈ దాడుల వెనుక ఎవరున్నారన్నది స్పష్టం కాలేదు. అయితే ఉగ్రవాదులు, బబూచిస్థాన్‌ వేర్పాటు వాదులు ఈ పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 

ALSO READ :- హైదరాబాద్ లో ఆటోల బంద్.. కారణం ఇదే

పోలింగ్ స్టేషన్‌లకు ప్రజలు వెళ్లకుండా ఉగ్రవాదులు ఎన్నికల అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని. అయితే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగేలా భద్రతా సిబ్బందిని మరింత పెంచుతున్నారని  సీనియర్ పోలీసు అధికారి అబ్దుల్లా జెహ్రీ చెప్పారు. ఈ ఉగ్రదాడులకు పాల్పడిన వారిని పట్టుకుని కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌లో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.