కోలుకోని పాకిస్తాన్ మార్కెట్లు .. కేఎస్​ఈ100 ఇండెక్స్ 6,948 పాయింట్లు డౌన్​

కోలుకోని పాకిస్తాన్ మార్కెట్లు ..  కేఎస్​ఈ100 ఇండెక్స్ 6,948 పాయింట్లు డౌన్​

కరాచీ:   రెండో రోజూ ఘర్షణలు  కొనసాగుతున్నాయనే వార్తల నడుమ గురువారం పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు 6 శాతానికి పైగా నష్టపోయాయి.   బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ కేఎస్​ఈ100 ఇండెక్స్ 6,948.73 పాయింట్లు (6.32 శాతం) పడిపోయి 1,03,060.30కి చేరుకుంది. దీంతో  ట్రేడింగ్​ను నిలిపివేశారు. 

పరిస్థితి కొంచెం ప్రశాంతంగా ఉందని ఏకేడీ వార్తలు రావడంతో ట్రేడింగ్ తిరిగి ప్రారంభమైంది. భౌగోళిక రాజకీయ పరిస్థితి కారణంగా పెట్టుబడిదారులు భయాందోళన చెందుతున్నందున పరిస్థితి మరింత దిగజారవచ్చని ఫాతిమా బుచా అనే ఎనలిస్టు అన్నారు.  సిమెంట్, ఇంధనం, బ్యాంక్,  టెక్నాలజీ వంటి కీలక స్టాక్స్​లో అమ్మకాల ఒత్తిళ్ల వల్ల మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు.