
లాహోర్: దాదాపు పదేళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై ఓ ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంలో పాక్‌లో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు శ్రీలంక గురువారం అంగీకారం తెలిపింది. డిసెంబర్ 11న ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో ఫస్ట్ టెస్ట్ రావల్పిండిలో, సెకండ్ మ్యాచ్ కరాచీలో జరుగుతుంది. 2009లో లాహోర్‌లో టెర్రరిస్ట్ అటాక్‌కు గురైన లంక జట్టు చివరిగా పాక్‌లో టెస్ట్ క్రికెట్ ఆడింది. గత నెలలో పాక్‌లో టీ20, వన్డే సిరీస్‌లు ఆడిన లంక మళ్లీ టెస్ట్‌ల కోసం రానుంది.