అండర్ 19 ఆసియా కప్ లో భారత్ తొలి మ్యాచ్ లోనే ఓటమిపాలైంది. దుబాయ్ వేదికగా ప్రస్తుతం అండర్ 19 ఆసియా కప్ కప్ జరుగుతోంది. ఇందులో భాగంగా శనివారం (నవంబర్ 30) భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ 43 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 238 పరుగులకే పరిమితమైంది.
282 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ప్రారంభం నుంచే తడబడింది. 28 పరుగులకే ఓపెనర్లు ఆయిష్ మాట్రే(20), వైభవ్ సూర్యవంశీ(1) ఔటయ్యారు. ఆ తర్వాత కూడా భారత ఇన్నింగ్స్ నిలకడగా కొనసాగలేదు. వరుస విరామాల్లో వికెట్లు పడడంతో మన కుర్రాళ్ళు ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఓ ఎండ్ లో నిఖిల్ కుమార్ హాఫ్ సెంచరీతో (67) పోరాడినా.. మరో ఎండ్ లో అతనికి సహకరించే వారు కరువయ్యారు. దీంతో 48.1 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌట్ అయింది.
ALSO READ : Vaibhav Suryavanshi: సచిన్, కోహ్లీకి బిగ్ షాక్.. వెస్టిండీస్ దిగ్గజానికి ఓటేసిన 13 ఏళ్ళ భారత క్రికెటర్
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 7 వికెట్ల నష్టానికి 281 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఓపెనర్ షాజిబ్ ఖాన్ 159 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో 5 ఫోర్లతో పాటు 10 సిక్సర్లు ఉన్నాయి. తొలి వికెట్ కు ఉస్మాన్ ఖాన్(60) తో ఏకంగా 160 పరుగులు జోడించాడు. ఆ తర్వాత భారత బౌలర్లు పుంజుకోవడంతో పాక్ స్కోర్ ను 300 పరుగులు దాటకుండా చేశారు. షాజిబ్ ఖాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.