ఒక్క వికెట్​ తేడాతో అఫ్గాన్‌‌పై పాకిస్తాన్​ విక్టరీ

ఒక్క వికెట్​ తేడాతో అఫ్గాన్‌‌పై పాకిస్తాన్​ విక్టరీ
  • లాస్ట్​ ఓవర్లో రెండు సిక్సర్లు 
  • కొట్టి గెలిపించిన నసీమ్​ షా
  • రాణించిన షాదాబ్‌‌, ఇఫ్తికర్‌‌
  • పోరాడి ఓడిన అఫ్గానిస్తాన్​

షార్జా: పేరుకు చిన్న ప్రత్యర్థే అయినా అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌.. ఆఖరి ఓవర్‌‌‌‌ వరకు పాకిస్తాన్‌‌‌‌కు ముచ్చెమటలు పట్టించింది. అప్పటి వరకు సూపర్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌తో అదరగొట్టిన ఫజల్​ హక్​ ఫరూఖి (3/31).. లాస్ట్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో చేసిన చిన్న తప్పుకు పెద్ద మ్యాచ్‌‌‌‌ను కోల్పోయింది. దీంతో బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన సూపర్‌‌‌‌–4 మ్యాచ్‌‌‌‌లో పాక్‌‌‌‌ ఒక్క వికెట్‌‌‌‌ తేడాతో అఫ్గానిస్తాన్‌‌‌‌పై గెలిచింది. వరుసగా రెండు విజయాలతో పాక్​తో పాటు శ్రీలంక ఆసియా కప్​ ఫైనల్​ చేరగా... ఇండియా, అఫ్గాన్​ రేసు నుంచి వైదొలిగాయి. ఈ థ్రిల్లింగ్​ లో స్కోరింగ్​ మ్యాచ్​లో తొలుత అఫ్గాన్​ 20 ఓవర్లలో 129/6  స్కోరు చేసింది. ఇబ్రహీం జద్రాన్‌‌‌‌ (37 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 35) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. తర్వాత పాక్‌‌‌‌ 19.2 ఓవర్లలో 131/9 స్కోరు చేసింది. షాదాబ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (26 బాల్స్‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌, 3 సిక్సర్లతో 36), ఇఫ్తికర్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ (33 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లతో 30) రాణించారు. షాదాబ్​కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

ఇబ్రహీం ఒక్కడే..
ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన అఫ్గాన్‌‌‌‌కు ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్‌‌‌‌ (21), రెహ్మనుల్లా గుర్బాజ్‌‌‌‌(17) మంచి ఆరంభాన్నిచ్చారు. కానీ ఆరు బాల్స్‌‌‌‌ తేడాలో ఇద్దరూ ఔట్‌‌‌‌కావడంతో అఫ్గాన్‌‌‌‌ 4.5 ఓవర్లలో 43 రన్స్‌‌‌‌కు 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇబ్రహీం, కరీమ్‌‌‌‌ జనత్‌‌‌‌ (15) నిలకడగా ఆడటంతో  సగం ఓవర్లకు 72/2 స్కోరుతో నిలిచింది. అయితే, కరీమ్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేయడం ద్వారా నవాజ్‌‌‌‌ ఈ జోడీని విడగొట్టాడు. అక్కడి నుంచి పాక్​ బౌలర్లు స్పీడు పెంచారు.  షాదాబ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో సిక్సర్‌‌‌‌ కొట్టిన నజీబుల్లా (10)తో పాటు మహ్మద్‌‌‌‌ నబీ (0) వరుస బాల్స్‌‌‌‌లో ఔటయ్యారు. దీంతో 15 ఓవర్లలో అఫ్గాన్‌‌‌‌ స్కోరు 93/5గా మారింది. షాదాబ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో భారీ సిక్సర్‌‌‌‌ కొట్టిన ఇబ్రహీంను 17వ ఓవర్‌‌‌‌లో రవూఫ్‌‌‌‌ వెనక్కి పంపాడు. అజ్మతుల్లా (10 నాటౌట్‌‌‌‌), రషీద్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (18 నాటౌట్‌‌‌‌) పోరాటంతో అఫ్గాన్‌‌‌‌ ఆ మాత్రం టార్గెట్‌‌‌‌ను నిర్దేశించగలిగింది.

చివర్లో ఉత్కంఠ.. 
అఫ్గాన్‌‌‌‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌‌‌‌ చేయ డంతో  ఛేజింగ్​లో పాక్​ టాపార్డర్‌‌‌‌ విఫలమైంది. కెప్టెన్‌‌‌‌ బాబర్‌‌‌‌ (0) ఇన్నింగ్స్‌‌‌‌ రెండో బాల్‌‌‌‌కు ఔటై మరోసారి నిరాశపర్చాడు. రిజ్వాన్‌‌‌‌ (20) ఓ మాదిరిగా ఆడినా, జమాన్‌‌‌‌ (5) ఫెయిలయ్యాడు.  45/3తో కష్టాల్లో పడ్డ జట్టును ఇఫ్తికర్‌‌‌‌ అహ్మద్‌‌‌‌, షాదాబ్‌‌‌‌ ఆదుకున్నారు. 12, 13వ ఓవర్‌‌‌‌లో షాదాబ్‌‌‌‌ 6, 4, 6తో జోష్‌‌‌‌ పెంచాడు. ఇఫ్తికార్‌‌‌‌ వేగంగా సింగిల్స్‌‌‌‌ తీయడంతో పాక్‌‌‌‌ స్కోరు 15 ఓవర్లలో 85/3కి చేరింది. కానీ 16వ ఓవర్‌‌‌‌లో ఇఫ్తికర్‌‌‌‌ ఔట్‌‌‌‌కావడంతో నాలుగో వికెట్‌‌‌‌కు 42 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. మహ్మద్‌‌‌‌ నవాజ్‌‌‌‌ (4) ఫోర్‌‌‌‌తో ఖాతా తెరవగా, 17వ ఓవర్‌‌‌‌ (రషీద్‌‌‌‌)లో సిక్సర్‌‌‌‌ కొట్టి షాదాబ్‌‌‌‌ ఔటయ్యాడు. తర్వాతి బాల్‌‌‌‌ను ఆసిఫ్‌‌‌‌ (16) సిక్సర్‌‌‌‌గా మలచడంతో పాక్‌‌‌‌ విజయానికి 18 బాల్స్‌‌‌‌లో 25 రన్స్‌‌‌‌ అవసరమయ్యాయి. పాక్​ ఈజీగా గెలుస్తుందనుకుంటున్న దశలో17వ ఓవర్‌‌‌‌లో ఫరూఖి.. నవాజ్‌‌‌‌, కుష్దిల్‌‌‌‌ షా (1)ను ఔట్‌‌‌‌ చేయడంతో ఉత్కంఠ మొదలైంది. తర్వాతి ఓవర్‌‌‌‌లో ఫరీద్‌‌‌‌ (3/31) దెబ్బకు రవూఫ్‌‌‌‌ (0) వెనుదిరగగా, అలీ సిక్స్‌‌‌‌ కొట్టి క్యాచ్‌‌‌‌ ఔటయ్యాడు. ఆఖరి ఓవర్లో 11 రన్స్‌‌‌‌ అవసరం  అవగా  ఫరూఖి వేసిన రెండు ఫుల్​ టాస్ బాల్స్​కు ​నసీమ్‌‌‌‌ షా (14 నాటౌట్‌‌‌‌) సిక్సర్లు కొట్టి గెలిపించాడు.