AFG vs PAK: అనుకున్నదే జరిగింది: పాక్ ఓటమికి కారణమైన ఐసీసీ

AFG vs PAK: అనుకున్నదే జరిగింది: పాక్ ఓటమికి కారణమైన ఐసీసీ

వరల్డ్ కప్ లో పసికూన ఆఫ్ఘనిస్తాన్ పాక్ జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పెద్దగా కష్టపడకుండానే పాక్ జట్టును చిత్తు చేశారు. బౌలింగ్ లో కాస్త గాడి తప్పినా బ్యాటింగ్ లో సత్త చాటారు. 282 పరుగుల లక్ష్యాన్ని ఎలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా ఫినిష్ చేశారు. దీంతో ఆఫ్ఘన్ ఈ వరల్డ్ కప్ లో  చిరస్మరణీయ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మ్యాచులో పాక్ ఓటమిని ఆ దేశ క్రికెట్ బోర్డు  ముందే గ్రహించింది. ఎలా అనుకుంటున్నారా.. ఈ స్టోరీ చదివేయాల్సిందే. 

వరల్డ్ కప్ లో వేదికలను ఖరారు చేసినప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియాతో బెంగళూరులో, చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచులను ఐసీసీ ఖరారు చేసింది. అయితే పాక్ క్రికెట్ బోర్డు మాత్రం ఈ రెండు వేదికల్లో మార్పులు చేయాల్సిందిగా కోరింది. ఆఫ్ఘన్ పై బెంగళూరు లో మ్యాచ్, ఆస్ట్రేలియాతో చెన్నైలో మ్యాచ్ నిర్వహించాలని తమ అభిప్రాయాన్ని తెలిపింది. కానీ ఐసీసీ మాత్రం పాక్ క్రికెట్ బోర్డు అభ్యర్ధనను లెక్క చేయలేదు. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ లు జరుగుతాయని పీసీబీ ఝలక్ ఇచ్చింది. 

చెన్నై లాంటి స్పిన్ పిచ్ మీద ఆఫ్ఘన్ నాణ్యమైన స్పిన్నర్లను ఎదుర్కొని గెలవడం అసాధ్యం అని అని భావించిన పాక్ ఈ విధంగా చేసి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఐసీసీ తమ ప్రపోజల్ ను రిజెక్ట్ చేయడంతో పాక్ చేసేదేమి లేక ఐసీసీ నిర్ణయించిన వేదికలోనే వరల్డ్ మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది. అయితే పాక్ బోర్డు భయపడినట్టుగానే ఈ రెండు మ్యాచ్ ల్లో పాక్ పరాజయాలను చవి చూసింది.

ALSO READ:  ODI World Cup 2023: దలైలామాతో న్యూజిలాండ్ క్రికెటర్లు.. ఫ్యామిలీలతో వెళ్లి దర్శనం
 

మొదట బెంగళూరులో జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియాపై 62 పరుగుల తేడాతో ఓడిపోగా.. నిన్న ( అక్టోబర్ 23) ఆఫ్ఘనిస్థాన్ పై 8 వికెట్ల తేడాతో ఓడింది. వరుసగా రెండు మ్యాచ్ ల్లో గెలిచిన పాక్.. ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయి సెమీస్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. మొత్తానికి ఐసీసీ వేదికలను మార్చకుండా పాక్ అభ్యర్ధనను తిరస్కరించడం పాక్ ఓటమికి కారణంగా నిలిచింది.