వరుడు, వధువుకి బంగారాన్నో, ఖరీదైన వస్తువుల్ని గిఫ్ట్ గా ఇస్తారు. కానీ ఓ మహిళ మాత్రం వరుడికి ఏకే47గన్ గిఫ్ట్ ఇవ్వడం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 30సెకన్ల వీడియో పాకిస్తాన్ లో జరిగిన పెళ్లి అని నేషనల్ మీడియా పేర్కొంది. పెళ్లిమండపంలో వరుడు, వధువు పక్కపక్కనే కూర్చొని ఉండగా..అంతలో ఓ మహిళ సదరు వరుడికి శుభాకాంక్షలు తెలిపి.. పెళ్లి కానుకగా ఏకే 47 గన్ ఇవ్వడంతో వధువు షాక్ తిన్న వీడియోను అదీల్ హసాన్ అనే నెటిజన్ సోషల్ మీడియోలో షేర్ చేశాడు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు.
