
- జైసల్మేర్‌లో పాక్ పైలెట్ అదుపులోకి
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చెందిన జేఎఫ్ 17 ఫైటర్ జెట్ పైలెట్‌ను రాజస్థాన్‌లోని జైసెల్మేర్లో ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకున్నది. పాకిస్తాన్ ఫైటర్ జెట్ ను కూల్చేసిన వెంటనే అందులోని పైలెట్.. పారాచూట్ సహాయంతో జైసెల్మేర్లో ల్యాండ్ అయ్యాడు. ఇది గమనించిన ఇండియన్ ఆర్మీ.. అతన్ని సజీవంగా అదుపులోకి తీసుకుని క్యాంప్‌కు తరలించింది.
ఇండియన్ ఎయిర్ స్పేస్‌లోకి దూసుకొచ్చి దాడి చేసేందుకు పాకిస్తాన్ ఫైటర్ జెట్ ప్రయత్నించింది. దీంతో ప్రతిదాడిగా ఇండియన్ ఆర్మీ ఆ యుద్ధ విమానాన్ని కూల్చేసింది. సదరు పైలెట్ ఆర్మీ కస్టడీలో ఉన్నాడో.. అతన్ని విచారిస్తున్నారో అన్నదానిపై స్పష్టత లేదు. పైలెట్ క్యాప్చర్ పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.