
సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న మహిళల వన్డే వరల్డ్ కప్ ప్రారంభోత్సవానికి పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు హాజరు కావడం లేదు. రిపోర్ట్స్ ప్రకారం సెప్టెంబర్ 30న ఇండియాలోని గౌహతిలో మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభోత్సవం జరగనుంది. బీసీసీఐ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రాబోయే మూడు సంవత్సరాల పాటు ఇండియా, పాకిస్థాన్ జట్లు ఐసీసీ టోర్నమెంట్ల కోసం ఒక దేశంలో మరొక దేశం రావడానికి వీలు లేదని నిర్ణయించారు. ఈ కారణంగా పాక్ కెప్టెన్ ఫాతిమా సనాతో పాటు జట్టు ప్రతినిధి, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధి ఎవరూ ప్రారంభోత్సవ వేడుక కోసం భారతదేశానికి వెళ్లరు.
గౌహతిలో జరిగే ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ప్రారంభోత్సవానికి పాకిస్తాన్ జట్టు హాజరు కావడం లేదు. పాకిస్థాన్ మినహాయించి మిగిలిన ఏడు జట్లు ఈ గ్రాండ్ వేడుకకు హాజరుకానున్నాయి. ఆ తర్వాత ఉమ్మడి విలేకరుల సమావేశం.. ట్రోఫీతో ఫోటోషూట్ ఉంటాయి. వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తమ అన్ని మ్యాచ్‌లను కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడుతుంది. పాకిస్థాన్ ఒకవేళ సెమీస్ లేదా ఫైనల్స్‌కు చేరుకోగలిగితే.. రెండు మ్యాచ్‌లు కూడా కొలంబోలోనే ఆడనున్నాయి. వరల్డ్ కప్ లో అక్టోబర్ 2న పాకిస్థాన్ తమ తొలి మ్యాచ్ ను బంగ్లాదేశ్ పై ఆడనుంది.
ALSO READ : నాలుగేళ్ల తర్వాత రిటైర్మెంట్ వెనక్కి..
ఇండియా, పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 5న మ్యాచ్ జరగనుంది. ఫాతిమా సనా కెప్టెన్ గా వ్యవహరిస్తోంది. మునీబా అలీ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. పాకిస్తాన్ సెమీ-ఫైనల్, ఫైనల్‌కు చేరుకుంటే మ్యాచ్‌లు కొలంబోలోనే జరుగుతాయి. లేకపోతే గౌహతి, నవీ ముంబై తొలి సెమీ ఫైనల్స్ కు ఆతిధ్యమిస్తాయి. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీ 2025, సెప్టెంబర్ 30 నుంచి 2025 నవంబర్ 2 వరకు జరగనుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఈ టోర్నీ ఐదు వేదికలలో హైబ్రిడ్ మోడ్‌లో జరగనుంది. భారత్‌లోని బెంగళూరు, గౌహతి, ఇండోర్, విశాఖపట్నం స్టేడియాల్లో మ్యాచులు జరగనున్నాయి.
ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ .. ఈ జట్లు వరల్డ్ కప్ కోసం పోటీ పడనున్నాయి. ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. సొంత దేశంలో టోర్నీ కావడంతో భారత్ హాట్ ఫేవరెట్. భారత్ చివరగా 2013లో ప్రపంచ్ కప్‌కు ఆతిథ్యం ఇవ్వగా.. ఈ టోర్నీలో ఇండియా ఉమెన్స్ టీమ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.
మహిళల ప్రపంచ కప్ 2025 కోసం పాకిస్థాన్ జట్టు:
ఫాతిమా సనా (కెప్టెన్), మునీబా అలీ సిద్ధిఖీ (వైస్ కెప్టెన్), అలియా రియాజ్, డయానా బేగ్, ఎమాన్ ఫాతిమా, నష్రా సుంధు, నటాలియా పర్వైజ్, ఒమైమా సొహైల్, రమీన్ షమీ, సదాఫ్ షమాస్, సాదియా సిద్రాజ్ అక్బాల్, షర్వాల్ సిద్రాజ్ అక్బాల్, (వికెట్ కీపర్) మరియు సయ్యదా అరూబ్ షా
నాన్-ట్రావెలింగ్ రిజర్వ్‌లు: గుల్ ఫిరోజా, నజిహా అల్వీ, తుబా హసన్, ఉమ్-ఎ-హని మరియు వహీదా అక్తర్