
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ క్రికెట్ లో తెలియని పేరు కాదు. కివీస్ క్రికెట్ లో వన్ ఆఫ్ ది లెజెండరీ బ్యాటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. న్యూజిలాండ్ తరపున నాలుగో స్థానంలో ఆడుతూ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తన అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్ కు 2021లో రిటైర్మెంట్ ప్రకటించాడు. నాలుగేళ్ల తర్వాత టేలర్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. టేలర్ న్యూజిలాండ్ తరపున కాకుండా వేరే దేశంతో ప్రాతినిధ్యం వహించనున్నాడు.
కొత్త జట్టు సమోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు టేలర్ శుక్రవారం (సెప్టెంబర్ 5) సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. టేలర్‌కు ఇప్పటికే సమోవా పాస్‌పోర్టు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో మరొక జట్టుకు ఆడేందుకు మూడేళ్ల స్టాండ్‌ఔట్ వ్యవధి పూర్తి కావడం కూడా టేలర్‌కు కలిసొచ్చింది. ‘‘ రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని సమోవా తరపున ఆడబోతుండడం గర్వంగా ఉంది. నా సొంత జట్టుకు ఆడడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. జట్టుతో కలిసి అనుభవాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను". అని టేలర్ రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకున్న తర్వాత చెప్పుకొచ్చాడు.
2026 టీ20 వరల్డ్ కప్ కు తన జట్టు సమోవాను క్వాలిఫై చేయడమే టేలర్ టార్గెట్. ఒమన్ వేదికగా జరగబోయే క్వాలిఫయర్ మ్యాచుల్లో ఆసియా - ఈస్ట్ ఆసియా - పసిఫిక్ రీజియన్ తరఫున వరల్డ్ కప్ కు అర్హత సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. రాస్ టేలర్ లాంటి అనుభవజ్ఞుడు జట్టులో ఉండడం ఆ దేశానికి కలిసొచ్చేదే. టేలర్ తల్లి తరఫున వారసత్వం సమోవాలోనే ఉండటం గమనార్హం.టేలర్ చివరిసారిగా 2022లో న్యూజిలాండ్ తరపున బంగ్లాదేశ్‌తో తన చివరి మ్యాచ్ ఆడాడు. ఈ నిర్ణయం అతడి క్రికెట్ అభిమానులకు సంతోషాన్ని కలిగించింది.
టేలర్ తన కెరీర్‌లో 112 టెస్టులు, 236 వన్డేలు, 102 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 18,199 పరుగులు చేసి కివీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా అనిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలోనూ (టెస్ట్, వన్డే, టీ20) 100 మ్యాచ్‌లు ఆడిన మొదటి క్రికెటర్ రాస్ టేలర్ చరిత్ర నిలిచాడు.
Will Ross Taylor and Samoa make it to next year's T20 World Cup? https://t.co/fiEaMcGmbc pic.twitter.com/1vlp7IKI4U
— ESPNcricinfo (@ESPNcricinfo) September 5, 2025