మసూద్​ అజహర్​ మా దేశంలో లేడు

మసూద్​ అజహర్​ మా దేశంలో లేడు

ఇస్లామాబాద్ : టెర్రర్​ సంస్థ జైషే మొహమ్మద్​ చీఫ్​ మౌలానా మసూద్​ అజహర్ ను అరెస్టు చేయాలని డిమాండ్​ చేస్తూ తాలిబాన్​ సర్కారుకు పాకిస్తాన్​ విదేశాంగ శాఖ లేఖ రాసింది. అతడు అఫ్గాన్​లోనే ఉన్నాడని ఆ లెటర్​లో పాక్ పేర్కొంది. పాకిస్తాన్​ నుంచి ఇతర దేశాల్లో టెర్రర్ కార్యకలాపాలు నిర్వహించేందుకు పాక్ కు మసూద్​ నిధులు సమకూరుస్తున్నాడని ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) తనపై ఒత్తిడి తేవడం వల్లే పాకిస్తాన్  ఈ లెటర్ ​రాసినట్లు తెలుస్తున్నది. టెర్రర్​ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటే పాక్​ను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని కూడా ఎఫ్ఏటీఎఫ్​ సూచించినట్లు సమాచారం. మసూద్​ అఫ్గాన్​లోని నన్గర్​హార్​, కన్హార్​ ప్రాంతాల్లో షెల్టర్​ తీసుకుంటున్నాడని పాక్​ మీడియా సంస్థ బోల్​ న్యూస్​ పేర్కొంది. అలాగే 26/11 ముంబై టెర్రర్ అటాక్​ ప్లానర్, లష్కరే తాయిబా కమాండర్​ సాజిద్​ మిర్​ను ఎఫ్ఏటీఎఫ్​ ఒత్తిడి వల్లే  పాక్ దోషిగా తేల్చింది. కాగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింరాజ్య స్థాపన కోసం జిహాద్​ చేయాలని జైషే క్యాడర్ ను మసూద్​ రెచ్చగొడుతూ పాకిస్తానీ సోషల్​ మీడియా నెట్ వర్క్స్ లో ఆర్టికల్స్​ పబ్లిష్​ చేస్తున్నాడు. 2019 మే 1న అతడిని అంతర్జాతీయ టెర్రరిస్టుగా యూఎన్ ప్రకటించింది.

పాక్​​​కు తాలిబాన్​ కౌంటర్
కాబూల్ : జైషే మహమ్మద్​ చీఫ్​ మౌలానా మసూద్​ అజహర్​ తమ దేశంలో లేడని తాలిబాన్లు తేల్చిచెప్పారు. ఎలాంటి ఆధారాల్లేకుండా అఫ్గానిస్తాన్​లో జైషే చీఫ్  తలదాచుకున్నాడని ఆరోపించడమేంటని పాకిస్తాన్​పై మండిపడ్డారు. అఫ్గాన్​ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్​ ఈమేరకు కామెంట్​ చేశారని టోలో న్యూస్​పేర్కొంది. మసూద్​ అజహర్  అఫ్గాన్​లోనే తలదాచుకున్నాడని, వెతికి పట్టుకుని అరెస్టు చేయాలని పాక్​ ప్రభుత్వం అఫ్గాన్​ విదేశాంగ శాఖకు లెటర్​ రాసింది. పాక్​ విదేశాంగ శాఖ ఉన్నతాధికారిని కోట్​ చేస్తూ ఆ దేశ మీడియా కథనాలు వెలువరించింది. ఈ వార్తలను జబీహుల్లా తీవ్రంగా ఖండించారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడంవల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని పాకిస్తాన్​ను హెచ్చరించారు. ఇండియా సహా పలు దేశాల ప్రభుత్వాలు వెతుకుతున్న అంతర్జాతీయ టెర్రరిస్టుకు తాము ఆశ్రయం కల్పించలేదని తేల్చిచెప్పారు. ఇతర దేశాలకు వ్యతిరేకంగా తమ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అఫ్గాన్​ ప్రభుత్వం ఒప్పుకోదని స్పష్టంచేశారు. నిజానికి పాక్​నుంచే పలు టెర్రరిస్టు సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని జబీహుల్లా పేర్కొన్నారు.