ఆయిల్ అయిపోయింది: పాకిస్తాన్లో 500 విమానాలు క్యాన్సిల్..

ఆయిల్ అయిపోయింది: పాకిస్తాన్లో 500 విమానాలు క్యాన్సిల్..

పక్కదేశం పాకిస్తాన్ అత్యంత దారుణమైన ఆర్థికసంక్షోభం ఎదుర్కొంటోంది. ఫైనాన్షియల్ క్రైసిస్ తో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. గ్యాస్ ధరలు మూడు రెట్లు పెరిగాయి.  తినడానికి తిండి లేక గత కొన్నినెలలుగా పాక్ జనాభాలో అధిక శాతం మంది ఆకలితో అలమటిస్తున్నారు. మరోపక్క ప్రభుత్వ రంగ సంస్థలను కూడా నడిపలేని దుర్భరపరిస్థితి నెలకొంది. తాజాగా ఇంధనం కొరతను ఎదుర్కొంటోంది. ఆయిల్ కంపెనీలు బకాయిలు చెల్లించనందున పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ తీవ్ర సంక్షోభాన్ని చవి చూస్తోంది. పాకిస్తాన్ స్టేట్ ఆయిల్ ఇంధనం సరఫరా నిలిపివేయడంతో 11 రోజుల్లో దాదాపు 500 విమానాలను రద్దు చేసింది. 

ఇంధనం అందుబాటులో లేకపోవడంతో గురువారం (అక్టోబర్26) కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్,క్వెట్టా, ముల్తాన్,పెషావర్ వంటి నగరాలతోపాటు ఇతర నగరాలకు దేశీంయంగా, అంతర్జాతీయంగా 49 విమానాలను రద్దు చేసింది. ఇంధనం కొరత కారణంగా 4బోయింగ్ విమానాలు గ్రౌండింగ్ చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ఇప్పటికే బ్యాంకుల నుంచి రూ. 260 బిలియన్ల అప్పును తీసుకుంది. తిరిగి చెల్లించేందుకు కష్టపడుతోంది. 

ALSO READ:- 43 రోజుల్లో 20 వేల మంది అవయవ దానానికి సంతకాలు