ఇమ్రాన్ చివరి బంతి వరకు పోరాడతారు

ఇమ్రాన్ చివరి బంతి వరకు పోరాడతారు

కరాచి: మిత్ర పక్షం క్వామీ మూవ్‌మెంట్ పాకిస్తాన్ (MQM)... ప్రతి పక్ష పార్టీయైన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP)కి మద్ధతు పలకడంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పటి వరకు అవిశ్వాసాన్ని ఏదో రకంగా గట్టిక్కెతానని భావించిన ఇమ్రాన్ కు  మిత్ర పక్షం  MQM రూపంలో గట్టి దెబ్బ తగిలింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి MQM  మద్ధతు తెలపడంతో.. అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ మెజారిటీ తగ్గిపోనుంది. ఈ నేపథ్యంలో రేపటి అవిశ్వాస పరీక్ష నెగ్గడం ఇమ్రాన్ కు అసాధ్యంగా మారింది. బలపరీక్షలో ఓడిపోయేకంటే ముందే రాజీనామా చేస్తే  గౌరవంగా ఉంటుందని కొంతమంది సన్నిహితులు ఇమ్రాన్ కు సలహా ఇస్తున్నారు. అయితే పాక్ మంత్రి  ఫవాద్ చౌదరి మాత్రం ఇమ్రాన్ పై పూర్తి భరోసాను వెలిబుచ్చారు. ఈ క్రమంలో ఫవాద్ చౌదరి ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. 

‘ఇమ్రాన్ ఖాన్ ఆటగాడు. చివరి బంతి వరకు పోరాడుతారు. రాజీనామా ప్రసక్తే లేదు. రేపటి మ్యాచ్ లో ఆయన ఎలా ఆడబోతున్నారో అందరూ చూస్తారు’ అంటూ పాక్ మంత్రి ఫవాద్ చౌదరి ట్వీట్ చేశారు. దీంతో పాక్ అసెంబ్లీలో రేపు జరగబోయే అవిశ్వాస పరీక్షపై అందరూ చర్చించుకుంటున్నారు. 

కాగా.. MQM సభ్యులు రాజీనామా చేస్తే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ బలం 164 కు తగ్గుతుంది. ప్రతిపక్షాల బలం  177 కి పెరగనుంది. పాకిస్తానీ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ మార్క్ 172. ప్రధానిపై అవిశ్వాస తీర్మానం విజయవంతం కావాలంటే.. ప్రతిపక్షానికి 172 సభ్యుల మద్దతు అవసరం. రేపు (మార్చి31) ఇమ్రాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం జరగనుంది.

మరిన్ని వార్తల కోసం..

కేజ్రీవాల్ ఇంటి వద్ద బీజేవైఎం ఆందోళన ఉద్రిక్తం

మూడు నెలల చిన్నారిని ఏడుసార్లు అమ్మిన్రు