మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో మెనూ ఫాలో కావడం లేదని, నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆరోపించారు. శనివారం ఉదయం టిఫిన్ కి చేసిన కిచిడీ, వంటపాత్రలతో యూనివర్సిటీ మెయిన్ గేటు ఎదుట ధర్నా చేశారు. ‘పెరుగన్నం మీకు.. పురుగుల అన్నం మాకా’ అంటూ నినదించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన మెనూ ఫాలో కావడం లేదన్నారు. శనివారం ఉదయం మెనూలో ఉత్తప్ప ఉండగా కిచిడీ, కారం పెట్టారని.. అందులో మొత్తం నూకలే ఉన్నాయని వాపోయారు. పీయూ రిజిస్ట్రార్ రమేశ్‌బాబు కలుగజేసుకొని కాంట్రాక్టర్లతో మాట్లాడి మెనూ ఫాలో అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో స్టూడెంట్స్ ధర్నా విరమించారు.
