అక్టోబర్ 16న పీయూ స్నాతకోత్సవం

అక్టోబర్ 16న పీయూ స్నాతకోత్సవం

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : ఈనెల16న పాలమూరు యూనివర్సిటీ 4వ స్నాత కోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆ వర్సిటీ వైస్ చాన్స్​లర్​ జీఎన్ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం పాలమూరు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. 

ఈనెల 16న పాలమూరు యూనివర్సిటీలోని ఆడిటోరియంలో  నిర్వహించే స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వస్తారని తెలిపారు. ప్రముఖ పారిశ్రామిక వేత మన్నె సత్యనారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పారు. మన్నె సత్యనారాయణరెడ్డికి గౌరవ డాక్టరేట్ ను గవర్నర్ అందజేస్తారని తెలిపారు.

ఈ విద్యాసంవత్సరం యూనివర్సిటీలో లా కాలేజ్ తోపాటు ఇంజినీరింగ్ కాలేజీలు ప్రారంభమయ్యాయని చెప్పారు. యూనివర్సిటీ ఇటీవల రెండో దశ న్యాక్ ( ఎన్ ఏఏసీ) అక్రిటేషన్ పూర్తి చేస్తుందని తెలిపారు. కార్యక్రమం యూనివర్సిటీకి ఒక మైలు రాయిగా నిలుస్తుందని ఆశాభవం వ్యక్తం 
చేశారు.