
షాద్ నగర్, వెలుగు : ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి షాద్ నగర్లో పోటీ చేస్తున్న పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. సోమవారం నందిగామ మండలంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆయన ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయారు.
కార్యకర్తలు ఆయనను వెంటనే షాద్ నగర్ పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విష్ణువర్ధన్ రెడ్డి స్వల్ప గుండెపోటుకు గురయ్యారని కార్యకర్తలు తెలిపారు. మెరుగైన ట్రీట్ మెంట్ కోసం ఆయనను హైదరాబాద్ లోని హాస్పిటల్ కు తరలించామన్నారు.