టొవినో థామస్, కయాదు లోహర్ జంటగా డిజో జోస్ ఆంటోనీ రూపొందించిన చిత్రం ‘పళ్లిచట్టంబి’. నౌఫల్, బ్రిజీష్, చాణక్య, చైతన్య, చరణ్ నిర్మించారు. ఏప్రిల్ 10న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరో హీరోయిన్ ఇలా ముచ్చటించారు. టొవినో థామస్ మాట్లాడుతూ ‘దర్శకుడు డిజో ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సయిటింగ్‌గా అనిపించింది. కథ ప్రకారం హీరో బలంగా కనిపించాలి. విలన్స్‌ను విసిరిపారేసేలా ఉండాలి. అందుకే వెయిట్ పెరిగాను.
హెయిర్ స్టైల్, మీస కట్టుతో ఒక మంచి లుక్ లోకి మారాను. -ఈ సినిమా 50వ దశకంలో కేరళలో జరిగిన ఇన్సిడెంట్స్ స్ఫూర్తిగా ఫిక్షనల్‌గా సాగే మూవీ. అప్పుడు సామాజికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటినే ఇందులో చూపించాం. మానవత్వం ముఖ్యమనే పాయింట్‌ను చూపిస్తున్నాం. ఇదొక బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫిలిం, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది’ అని అన్నాడు.
హీరోయిన్ కయాదు లోహర్ మాట్లాడుతూ ‘కథ విన్నాక నా కెరీర్‌లో ఇదొక స్పెషల్ మూవీ అవుతుందని అనిపించింది. రెబెకా అనే ఇంటలెక్చువల్, రూటెడ్ క్యారెక్టర్‌లో కనిపిస్తా. నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. టొవినోను చూసి ఇన్‌స్పైర్ అయి నటించా’ అని చెప్పింది.
