
పాన్ కార్డుకు ఆధార్ నంబర్ లింక్ చేయడానికి ఇంకా మూడు రోజులే గడువు ఉంది. మార్చి 31 లోపు పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేసుకోవాలని ఐటీ అధికారులు చెప్పారు. ఆధార్, పాన్ లింకింగ్‌కు ముందుగా జూన్ 20.2018 వరకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని మార్చి 31, 2019 వరకు పొడగించారు. ఐటీ రిటర్నింగ్ దాఖలుకు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి అని స్పష్టం చేశారు అధికారులు. పాన్- ఆధార్ లింక్ చేయాలంటూ ఐటీ అధికారులు పదే పదే ప్రకటనలు ఇస్తున్నారు. పాన్ కార్డుకు ఆధార్ లింక్ ఎలా చేసుకోవాలో చెబుతున్నారు. ఎస్‌ఎంఎస్ సర్వీస్ లేదా ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఈ అనుసంధానం చేసుకోవచ్చని తెలిపారు. మొబైల్ ఫోన్, బ్యాంకు వంటి కొన్నింటికి ఆధార్ లింకు తప్పనిసరి కాకున్నా..పాన్ కార్డుకు వంటి వాటికి ఆధార్ లింకు తప్పనిసరి అని సుప్రీం కోర్టు చెప్పింది.