ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో ఎన్నికలు..

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో ఎన్నికలు..
  • పంచాయతీ ఎలక్షన్ షెడ్యూల్​ విడుదల

మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,613 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.  జిల్లాల వారీగా మెదక్ లో 492​ పంచాయతీలు, 4,220 వార్డు స్థానాలు,  సిద్దిపేటలో 508 పంచాయతీలు,  4,508 వార్డు స్థానాలు, సంగారెడ్డిలో  613 పంచాయతీలు, 5,370 వార్డు స్థానాలు ఉండగా మూడు జిల్లాలోనూ రాష్ట్ర ఎన్నికల కమిషన్​ విడుదల చేసిన షెడ్యూల్​ కు అనుగుణంగా డిసెంబర్ 11న  మొదటి విడత, 14న రెండో విడత, 17న మూడో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి.

మెదక్ జిల్లాలో..

మొదటి విడతలో మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, హవేలీ ఘనపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేట మండలాల పరిధిలోని 160 గ్రామ పంచాయతీలు, 1,402 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

 రెండో విడతలో తూప్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి, మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, మెదక్ మండలాల పరిధిలోని 149 గ్రామ పంచాయతీలు, 1,290 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

మూడో విడతలో నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని నర్సాపూర్, చిలప్​చెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, తూప్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వెల్దుర్తి, మాసాయిపేట మండలాల పరిధిలోని 183 గ్రామ పంచాయతీలు, 1,528 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

సిద్దిపేట జిల్లాలో..

 మొదటి విడతలో గజ్వేల్  రెవెన్యూ డివిజన్ పరిధిలోని  గజ్వేల్, జగదేవ్ పూర్, మర్కుక్, ములుగు, రాయపోల్, వర్గల్, సిద్దిపేట డివిజన్ పరిధిలోని దౌల్తాబాద్  మండలాల పరిధిలోని 163 గ్రామ పంచాయతీలు, 1,432 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

రెండో విడతలో  సిద్దిపేట  రెవెన్యూ డివిజన్ పరిధిలోని అక్బర్ పేట -భూంపల్లి,  చిన్నకోడూరు, దుబ్బాక, మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, తొగుట, హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని బెజ్జంకి మండలాల పరిధిలోని 182 గ్రామ పంచాయతీలు, 1,644 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
మూడో విడతలో  హుస్నాబాద్  రెవెన్యూ డివిజన్ పరిధిలోని అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ, మద్దూరు, ధూల్మిట్ట, సిద్దిపేట డివిజన్ లోని  కొమురవెల్లి, చేర్యాల, గజ్వేల్ డివిజన్ లోని కొండపాక, కుకునూరుపల్లి మండలాల పరిధిలోని 163 గ్రామ పంచాయతీలు, 1432 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

సంగారెడ్డి జిల్లాలో..

మొదటి విడతలో సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలోని సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట, పటాన్ చెరు, గుమ్మడిదల, హత్నూర మండలాల పరిధిలో 136 గ్రామ పంచాయతీలు, 1,246 వార్డు స్థానాలకు ఎన్నికలు 
జరగనున్నాయి.

రెండో విడతలో అందోల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అందోల్, చౌటకూర్, పుల్కల్, వట్ పల్లి, జహీరాబాద్ డివిజన్ పరిధిలోని రాయికోడ్​, ఝరాసంగం, జహీరాబాద్, మొగుడంపల్లి,  కోహిర్, సంగారెడ్డి డివిజన్ పరిధిలో మునిపల్లి మండలాల పరిధిలో 243 గ్రామ పంచాయతీలు, 2,164 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

మూడో విడతలో నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని కల్హేర్, కంగ్టి, మనూర్, నాగల్ గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట్, సిర్గాపూర్ మండలాలు, జహీరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని న్యాల్కల్ మండలాల పరిధిలో 234 గ్రామ పంచాయతీలు, 1,960 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.