ఓట్ల కోసం కోతులను పట్టించిండు! హామీని ముందే అమలు చేసిన వెన్నంపల్లి సర్పంచ్ అభ్యర్థి

ఓట్ల కోసం కోతులను పట్టించిండు! హామీని ముందే అమలు చేసిన  వెన్నంపల్లి సర్పంచ్ అభ్యర్థి

కరీంనగర్, వెలుగు:  పంచాయతీ ఎన్నికల బరిలో నిల్చున్న అభ్యర్థులు పలురకాల హామీలు ఇస్తుండగా.. కరీంనగర్ జిల్లాలో ఓ అభ్యర్థి హామీ ఇవ్వడమే కాదు, ఎన్నికకు ముందే నెరవేర్చి చూపాడు. సైదాపూర్ మండలం వెన్నంపల్లిలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. పంచాయతీ ఎన్నికలకు ముందు నుంచే తనను గెలిపిస్తే కోతులు పట్టిస్తానని సర్పంచ్ అభ్యర్థి చిరంజీవి హామీ ఇస్తున్నారు. 

శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. వారం కిందే కోతులు పట్టేవాళ్లతో మాట్లాడి శుక్ర, శనివారాల్లో కోతులను పట్టించారు. ఏడాదిపాటు ఎప్పుడైనా ఊళ్లలోకి కోతులు వచ్చినా పట్టేలా అగ్రిమెంట్ చేసుకున్నాడు. తనను గెలిపిస్తే గ్రామంలో కోతులు లేకుండా చేస్తానని చిరంజీవి ప్రచారం చేస్తున్నారు.