హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీలలో15వ ఆర్థిక సంఘం గ్రాంట్, ఎస్‌ఎఫ్‌సీ గ్రాంట్, జనరల్ ఫండ్ నుంచి ఖర్చు చేసిన వ్యయానికి సంబంధించి పెండింగ్ బిల్లుల వివరాలను పంపించాలని డీపీఓలను పంచాయతీరాజ్‌శాఖ ఆదేశించింది.
2024 ఫిబ్రవరి నుంచి నవంబర్22 వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల వివరాలను జతచేసి ఎక్సెల్ ఫార్మాట్‌లో అందించాలని కోరింది. 15వ ఆర్థిక సంఘం గ్రాంట్, ఎస్‌ఎఫ్‌సీ, జనరల్ ఫండ్ నుంచి ఇంకా చెక్కులు రూపొందించని, ఇష్యూ చేయని పెండింగ్ బిల్లుల వివరాలు మాత్రమే సమర్పించాలంది.
