- పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
ఆర్మూర్, వెలుగు : బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాలు, రోడ్లు, గాట్స్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక రూపొందించి అభివృద్ధి పనులు చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం ఆర్మూర్ లో అమృత్ 2.0 పనులకు, టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కాంగ్రెస్ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాజకీయాలు ఎలక్షన్స్ అప్పుడేనని ఆ తర్వాత అభివృద్ధి కోసం పని చేస్తామన్నారు. తాను జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్నందున జిల్లాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు జిల్లా ప్రజలు తరలిరావాలని మంత్రి కోరారు.
ఆర్మూర్‌లో అరైవ్ అలైవ్ ప్రోగ్రాం..
ఆర్మూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఆర్మూర్‌లో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని జర్నలిస్టులు, వాహనదారులకు హెల్మెట్లు అందజేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ధరించాలన్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని తెలిపారు. తొలిసారి ఆర్మూర్ కు వచ్చిన సీతక్కకు ఆర్మూర్ లో ఘనస్వాగతం లభించింది. ఆర్మూర్ నియోజకవర్గ సమస్యలపై కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్‌రెడ్డి మెమోరాండం అందజేసి ఘనంగా సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబాగౌడ్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్‌హెచ్ వో సత్యనారాయణ గౌడ్, మార చంద్రమోహన్, సంజయ్ సింగ్ బబ్లు, పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, మోత్కురి లింగాగౌడ్, మున్ను, ఖాందేశ్ శ్రీనివాస్, వెంకట్రామ్ రెడ్డి పాల్గొన్నారు.
సంక్షేమం,అభివృద్ధి రెండు కండ్లు..
బాల్కొండ : సంక్షేమం, అభివృద్ధి రెండ్లు కండ్లలా కాంగ్రెస్ సర్కార్ పని చేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా పర్యటన ముగించుకుని మార్గమధ్యలో ఉన్న మెండోరా మండలం సావెల్ నుంచి తడపాకల్ వరకు రూ.2.15కోట్లతో చేపట్టే బీటీ రోడ్డు, రూ.25కోట్లతో అమృత్ 2.0, రూ.15 కోట్లతో పట్టణ అభివృద్ధి పనులు, భీంగల్ నుంచి నర్సాపూర్ వరకు రూ.1.85 కోట్లతో చేపట్టే బీటీ రోడ్ల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేడారం జాతర పూర్తయ్యాక బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న గోదావరి పరీవాహక ప్రాంతంలో ఆధునిక పుష్కర ఘాట్లు,రోడ్లు, దేవాలయాల మరమ్మతులు చేపడుతామని సీఎం రేవంత్ రెడ్డి మాటలను గుర్తుచేశారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగులో 110 కిలోమీటర్ల మేర గోదావరి పరీవాహకం ఉందని చెప్పారు. రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అధిక వార్డుల్లో గెలిచి చైర్మన్స్థానాలకు దక్కించుకోవాలన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క భీంగల్ సర్కిల్ లో అరైవ్ అలైవ్‌లో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీని అర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆడిషనల్ కలెక్టర్ అంకిత్, అర్మూర్ సబ్ కలెక్టర్ మాల్వియా, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టింటి ముత్యం రెడ్డి, భీంగల్ మున్సిపల్ కమిషనర్ గంగాధర్, సర్పంచ్‌లు శ్యామల, సీఐ పొన్నం సత్యనారాయణ గౌడ్, ఎస్సైలు పాల్గొన్నారు.
