గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలి : మంత్రి సీతక్క

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలి : మంత్రి సీతక్క
  • పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

కామారెడ్డిటౌన్, వెలుగు : గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్​లు పని చేయాలని  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజీలో నిర్వహించిన సర్పంచ్​ల శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.  గ్రామ పంచాయతీలు ప్రజాస్వామ్యానికి పునాదిలాంటివన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి బాధ్యతగా పని చేయాలని ప్రభుత్వ పథకాలను  సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.

తాగునీరు,  పారిశుధ్యం,  రహదారులు, విద్య,  వైద్యం వంటి సదుపాయాల కల్పనకు ప్రాధానత్య ఇవ్వాలని సూచించారు. అర్హులైన  ప్రతి ఒకరికీ సంక్షేమ పథకాలు చేరేలా సర్పంచ్​లు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.  కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ రాష్ర్ట, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. గ్రామాల్లో చేపట్టే పనుల్లో నాణ్యత ఉండాలని తెలిపారు. అడిషనల్ కలెక్టర్​ మదన్మోహన్​, డీపీవో మురళి తదితరులు పాల్గొన్నారు.