- ఆర్థిక ఇబ్బందులతో విలేజ్ సెక్రటరీ సూసైడ్
తొర్రూరు, వెలుగు : ఆర్థిక ఇబ్బందులతో ఓ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణానికి చెందిన పేర్ల వెంకన్న (31) దంతాలపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర నుంచి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. దీనికి తోడు ఉద్యోగం పర్మినెంట్ కాలేదన్న బాధతో మనస్తాపానికి గురయ్యాడు.
దీంతో శనివారం పట్టణంలోని కంఠాయపాలెం రోడ్డులో గల బావిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. గమనించిన స్థానికులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య పేర్ల లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు.
