పంజాగుట్ట: ఫ్లైఓవర్ కింద ఇరుక్కున్న గణేశ్ విగ్రహం

పంజాగుట్ట: ఫ్లైఓవర్ కింద ఇరుక్కున్న గణేశ్ విగ్రహం

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఖైరతాబాద్ నుంచి ఊరేగింపుగా తరలిస్తున్న భారీ గణేశ్ విగ్రహం ఆదివారం పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయింది. విగ్రహం ఎత్తు ఎక్కువగా ఉండడంతో ఫ్లైఓవర్ కింద కదల్చడం కష్టమై, ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించారు. విగ్రహాన్ని కదిలించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి.