
చెన్నై: పార్టీ రూల్స్‌ను ఉల్లంఘించారనే కారణంతో పన్నీర్ సెల్వం బ్రదర్ రాజాను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. ఈ మేరకు పార్టీ కో ఆర్డినేటర్ పన్నీర్ సెల్వం, కో కో ఆర్డినేటర్ కె.పళనిస్వామి జాయింట్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చారు. అన్నాడీఎంకే మాజీ చీఫ్ జయలలిత సన్నిహితురాలు శశికళను కలిసిన తరువాత రోజే రాజా పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. రాజాతోపాటు శశికళతో మీటింగ్‌కు హాజరైన థేని జిల్లాకు చెందిన మరో ముగ్గురిని కూడా పార్టీ నుంచి డిస్మిస్ చేసినట్టు స్టేట్మెంట్లో వివరించారు.