కేజ్రీవాల్ ఉన్న ప్రాంతాల్లో కరెంటు బిల్లు ఉండదని ప్రతి పిల్లవాడికీ తెలుసు

కేజ్రీవాల్ ఉన్న ప్రాంతాల్లో కరెంటు బిల్లు ఉండదని  ప్రతి పిల్లవాడికీ తెలుసు

ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్‌ ఎంత నమ్మకం ఉందో ఇప్పుడు ప్రతీ ఒక్క చిన్నారికీ తెలుసట. అందుకు ఈ వీడియోనే ఉదాహరణగా నిలుస్తోంది. హర్యానాకు ‘ఉచిత విద్యుత్’ ఇస్తామని కేజ్రీవాల్ చేసిన వాగ్దానాన్ని ప్రతిబింబిస్తూ ఓ చిన్నారి ఈ వీడియోలో కనిపించింది. సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోన్న ఈ వీడియోను గగన్‌దీప్‌ సింగ్‌ అనే పార్టీ నేత ఒకరు ట్వీట్‌ చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, కరెంటు బిల్లు గురించి చింతించకుండా ఎయిర్ కండీషనర్ ఆన్ చేయమని ఈ చిన్నది.. తన తండ్రికి చెప్పడం అందర్నీ ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోలో నాన్న, చాలా వేడిగా ఉంది.. ఏసీ ఆన్ చెయ్యి అని పిల్లాడు కోరుతాడు. దానికి తండ్రి విద్యుత్ సరఫరా కోసం చెల్లించాల్సిన బిల్లును ఉద్దేశించి సమాధానం చెప్పాడు. అయితే, విద్యుత్ ఛార్జీల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ చిన్నారి ప్రశాంతంగా చెప్తాడు. కేజ్రీవాల్.. ఆ ప్రాంతంలో ఉచిత విద్యుత్‌ను అందిస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని ప్రతిబింబిస్తూ, పిల్లవాడు తన తండ్రితో, "బిల్ చెల్లించాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ చెప్పారు" అని చెప్పడం ఈ వీడియోలో చూడవచ్చు.

ఈ ఫుటేజీని సింగ్ ఆగస్టు 3న ట్వీట్ చేశారు. దాంతో పాటు "కేజ్రీవాల్ ఉన్న ప్రాంతాల్లో కరెంటు బిల్లు ఉండదని హర్యానాలోని ప్రతి పిల్లవాడికీ తెలుసు" అని క్యాప్షన్ లోనూ చేర్చారు. పిల్లవాడు తన క్యూట్ నెస్ తో, తన తల్లితండ్రులతో మాట్లాడే విధానంతో, అతని వాయిస్‌తో నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నాడు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ ఫుటేజీకి రిప్లై ఇస్తూ.. ‘సో క్యూట్’ అంటూ వారు కామెంట్స్ చేశారు.